Top
Sneha TV

నిజాలు నిగ్గు తేల్చాలి: గల్లా జయదేవ్‌

X

దిల్లీ: రఫేల్‌ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. రఫేల్‌ అవకతవకలపై లోక్‌సభ వేదికగా మోదీ ప్రభుత్వాన్ని జయదేవ్‌ తూర్పారబట్టారు. రఫేల్‌ ఒప్పందం విలువ రూ.24వేల కోట్లని ప్రభుత్వం చెబుతుంటే డసాల్ట్‌ ఏవియేషన్‌ మాత్రం రూ.60వేల కోట్లని పేర్కొంటోందని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై రక్షణ మంత్రి సమాధానమివ్వాలని జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. ''మార్చి 2014లో హెచ్‌ఏఎల్‌, డసాల్ట్‌ మధ్య ఒప్పందం జరిగింది. రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని 2015లో ఉన్నపళంగా ప్రకటించారు. రక్షణ మంత్రి ఆమోదం లేకుండానే ప్రధాని ఫ్రాన్స్‌లో ఎలా అంగీకారం తెలిపారు?. హెచ్‌ఏఎల్‌కు సామర్థ్యం ఉందని హెచ్‌ఏఎల్‌ హెడ్‌ చెప్పారు. హెచ్‌ఏఎల్‌కు సార్థ్యం ఉన్నా రిలయన్స్‌కు ఎందుకిచ్చారు? రఫేల్‌ విషయంలో కాగ్‌ నివేదికపై రక్షణమంత్రి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం పాత ఒప్పందం పక్కనపెట్టి కొత్త ఒప్పందం ఎందుకు చేసుకుంది? యూపీఏ నాటి ఒప్పందానికి.. ప్రస్తుత ఒప్పందానికి తేడా ఏంటి? ప్రధానిపై ఆరోపణలు వస్తున్నా ఆయన నేరుగా ఎందుకు స్పందించట్లేదు? ప్రధానికి ప్రజాస్వామ్యం పట్ల, పార్లమెంట్‌ పట్ల గౌరవం లేదు. జేపీసీ ఏర్పాటు చేసి ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చాలి'' అని జయదేవ్‌ డిమాండ్‌ చేశారు.

Next Story
Share it