Top
Sneha TV

తెలంగాణలో టీడీపీకి ఏం జరిగిందో ఏపీలోనూ అదే జరగబోతోంది: మోదీ

X

విశాఖ: సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. హామీలు నిలబెట్టుకోలేకపోతేనే తనను విమర్శిస్తారని, ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే టీడీపీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ దుష్ట కాంగ్రెస్‌ అనేవారని, ఇప్పుడు టీడీపీ దోస్త్‌ కాంగ్రెస్‌ అంటోందని ఆరోపించారు.

''తెలంగాణలో టీడీపీకి ఏం జరిగిందో ఏపీలోనూ అదే జరగబోతోంది. స్వచ్ఛ్‌ భారత్‌లో భాగంగా 38 లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. 2 వేల కి.మీ మేర రోడ్లను నిర్మించాం. 2 లక్షల మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. ముద్ర కింద 26 లక్షల రుణాలు ఇచ్చాం. 2.5 లక్షల మంది యువతకు స్కిల్‌ ట్రైనింగ్‌ ఇచ్చాం. 1.6 లక్షల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశాం'' అని మోదీ తెలిపారు.

Next Story
Share it