Top
Sneha TV

మూడు బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులైన విజయ, దేనా, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని బ్యాంకింగ్ రంగంలో తొలిసారి మూడు బ్యాంకులు విలీనం కానున్నాయి. మూడు బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ తర్వాత ఇది రెండో అతి పెద్ద బ్యాంక్‌గా నిలవనుంది. విలీన ప్రక్రియలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం చేసుకుంటున్న బ్యాంక్‌గా.. మిగతా రెండూ విలీనమవుతున్న బ్యాంకులుగా గుర్తిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకుల విలీనం కారణంగా.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికంగా ఇది పటిష్ఠమవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. నిజానికి ఈ విలీనాన్ని నిరసిస్తూ ఈ మధ్యే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it