క్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు
X
హైదరాబాద్ : క్షణికావేశంలో ఓ యువకుడు స్నేహితున్ని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బార్కస్కు చెందిన వాలిసాది(24) ఫైసల్లు భాగస్వామ్యంలో ఓ వ్యాపారం చేస్తున్నారు. నిన్న అర్థరాత్రి మిత్రులతో కలిసి ఇద్దరు బార్కస్ గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో ఏమో ఆగ్రహించిన ఫైసల్.. వాలిసాదిపై కత్తితో దాడి చేశాడు. దీంతో వాలిసాది ఘటనా స్థలంలోనే కుప్పకూలాడు.సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాలిసాదిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలొనే అతడు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story