Sneha TV
న్యూస్

ఈజిప్టులో 40 మంది ఉగ్రవాదుల కాల్చివేత

X

గీజా పిరమిడ్లను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన బాంబుదాడిలో నలుగురు మరణించిన నేపథ్యంలో ఈజిప్టు అధికారులు పెద్దఎత్తున వేట మొదలుపెట్టారు. రెండు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో 40 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వరుస దాడులకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రదేశాలను వారు తమ లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఏరివేతలకు శుక్రవారం నాటి గీజా ఉగ్రదాడికి సంబంధం ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు.

ఉత్తర సినాయ్, గీజా ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టారు. అనుమానిత ఉగ్రవాదులు భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో హతులయ్యారని ఈజిప్టు ప్రభుత్వ వార్తాసంస్థ మెనా తెలిపింది. హతులైన ఉగ్రవాదుల పటోలను విడుదల చేసింది. అందరికీ ముసుగులు ఉండడంతో వారి ముఖాలు కనిపించడం లేదు. పక్కన తుపాకులు పడిఉన్నాయి. అనుమానితుల పేర్లు, భద్రతాదళాలకు కలిగిన నష్టం గురించి హోంశాఖ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

గీజా ఉగ్రదాడిలో ముగ్గురు వియత్నామీయులు, ఒక ఈజిప్షియన్ గైడ్ మరణించారు.

Next Story
Share it