Top
Sneha TV

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ : కేక పుట్టిస్తున్న కేక్స్..

X

హైదరాబాద్ : న్యూ ఇయర్ కేక్స్ సందడి చేస్తున్నాయి. మార్కెట్లో వెరైటీ వెరైటీ కేక్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తు.. డిఫరెంట్ ఫ్లేవర్లలో ఆకట్టుకుంటున్నాయి. వేడుకలకు కేక్స్ కట్ చేసుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో ఇక న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు చిన్నా పెద్దా రెడీ అయిపోతున్నారు. గతంలో అపార్ట్ మెంట్స్ లో ఎవరి ప్లాట్స్ లో వారే సెలబ్రేట్ చేసుకునేవారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్స్..గేటెడ్ కమ్యూనిటీస్ ఫ్యామిలీస్ అంతా ఒకేచోట చేరి వినాయక చవితి, దీపావళి, న్యూఇయర్ వంటి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ కు సెలవు ప్రకటించటం..వరసగా మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. బేకరీలలో కేక్స్ రకరకాల ఫ్లేవర్స్..రకరకాల మోడల్స్ తో రా రమ్మని ఆహ్హానిస్తున్నాయి. దీంతో స్పెషల్ డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడ్డారు బేకర్స్. న్యూ డిసెంబర్ 31 నైట్ అన్ని పార్టీల్లో కేక్ కంపల్సరీ. కేక్ కటింగ్ తో కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడం కామన్ గా మారిపోయింది. న్యూ ఇయర్ కోసం..వెరైటీ వెరైటీ కేక్స్.మార్కెట్ లో కేక పుట్టిస్తున్నాయి. మార్కెట్ లో ఫ్లేవర్, డిజైన్ ను బట్టి రేట్ సెరరేట్ గా వుంటుంది.

గతంలో బేకరీలో ఉండే డిజైన్స్ లో ఏదో ఒకటి నచ్చింది తీసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇలా బేకరీల్లో కేక్స్ డిజైన్ మెనూ చూసి సెలెక్ట్ చేసుకునేలా కస్టమర్స్ ఇచ్చిన డిజైన్ తగ్గట్టు ఒక గంటలో కేక్ రెడీ చేసి ఇస్తున్నారు బేకర్స్. ప్రస్తుతం మార్కెట్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బొమ్మల కేక్స్, బ్లాక్ ఫారెస్ట్, ప్లమ్ కేక్స్ కు డిమాండ్ బాగా ఉంది. కేక్ లో కూడా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్, డ్రైప్రూట్స్, 3డి కేక్స్ కోసం ముందుగానే ఆర్డర్స్ ఇస్తున్నారు కస్టమర్లు. ఈ కేక్స్ ధర కేజీ 5 వందల నుంచి 9 వందలగా ఇక డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ కేక్స్ అయితే..వేల రేట్స్ లో కూడా వున్నాయంటే న్యూ ఇయర్ కు కేక్స్ వుండే డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు కేక్స్ కి ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. జస్ట్ ఆర్డర్ ఇచ్చి. డబ్బులు చెల్లిస్తే చాలు. కేక్ డైరెక్ట్ గా నట్టింటోకి నెట్టిల్లు తెచ్చి పెట్టేస్తోంది. దీంతో సీటీ పీపుల్స్ ఆన్ లైన్ ఆర్డర్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story
Share it