Sneha TV
న్యూస్

మనిషా పశువా : బిల్డింగ్ పై నుండి పసిబిడ్డను విసిరేశాడు..

X

హైదరాబాద్ : భార్యతో గొడవ పడ్డ ఓ భర్త పశువులా మారాడు..మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదస్థితిలో అభం శుభం తెలియని 8 నెలల చిన్నారిని రెండు అంతస్తు నుండి విసిరేశాడు. కన్న తండ్రి చేసిన ధ ఘటన నాచారంలో జరిగింది. చిన్నారిని విసిరేసిన తరువాత భయంతో ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నమహారాష్ట్రకు చెందిన మనోజ్ భార్య జహ్నవితో తరచు గొడవ పడుతుండేవాడు. డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్న మనోజ్ డిసెంబర్ 30వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. తరువాత విచక్షణ కోల్పోయి 8 నెలల కుమార్తెను రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పాపను గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం చికిత్స నందించటంతో ప్రాణాలతో బైటపడింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మనోజ్ కోసం గాలిస్తున్నారు.

Next Story
Share it