Top
Sneha TV

'ఎస్‌ సర్‌' బదులుగా 'జైహింద్‌, జైభారత్‌'

X

- పాఠశాలలకు గుజరాత్‌ ప్రభుత్వ ఆదేశాలు
గాంధీనగర్‌ : విద్యార్థుల్లో మతోన్మాదాన్ని పెంచటాన్ని గుజరాత్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు తీసుకెళుతున్నది. ఇప్పటి నుండి గుజరాత్‌లోని అన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయుడు హాజరు వేసినప్పుడు విద్యార్థులు జై భారత్‌ లేదా జైహింద్‌ అని పలకాలని అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి రాజస్తాన్‌లోని ఒక ఉపాధ్యాయుడి నుండి స్ఫూర్తి పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నత పాఠశాల బోర్డు, ప్రాథమిక పాఠశాల డైరెక్టర్లకు ఈ మేరకు సర్య్కులర్‌ను ప్రభుత్వం జారీ చేసింది. 'చిన్న వయస్సు నుండి జాతీయవాదాన్ని పెంపొందించడానికి జనవరి 1 నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా హాజరు వేసే సమయంలో 'ఎస్‌ సార్‌', 'ప్రెజెంట్‌ సర్‌' బదులుగా ' జై భారత్‌' లేదా 'జై హింద్‌' అని స్పందించాలని సర్య్కులర్‌లో పేర్కొంది. ఇటువంటి ప్రక్రియను చేపట్టినందుకు రాజస్థాన్‌ జాలూరు జిల్లాలోని పాఠశాలలో చరిత్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సందీఫ్‌ జోషిని ఎబివిపి జాతీయ సమావేశంలో ఓ పురస్కారంతో సత్కరించింది. ఇటువంటి మంచి ప్రయత్నంలో ప్రేరణ పొందడంలో తప్పేమి లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడసామా సమర్థించుకున్నారు.

Next Story
Share it