Top
Sneha TV

కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు.. చైర్‌పర్సన్‌ను నిలదీసిన ఎమ్మెల్యే!

X
  • ఏ జీవో ప్రకారం వైస్‌ చైర్మన్‌ను తొలగించారు...?

ఇచ్ఛాపురం/శ్రీకాకుళం: 'ఏవిధంగా.. ఏ జీవో ప్రకారం వైస్‌ చైర్మన్‌ను తొలగించారో చెప్పండి. తోటి మహిళకు అవమానించడం సరైన పద్ధతి కాదు. వైస్‌చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలంటే ఈ విషయాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చి కౌన్సిల్‌లో పెట్టాలి. కుట్రపూరిత రాజకీయాలు చేయవద్దు' అని ఎమ్మెల్యే అశోక్‌ చైర్‌పర్సన్‌ రాజలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపాల్టీ పాలకమండలి సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ విషయంలోఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి మ ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సోమవారం చైర్‌పర్సన్‌, కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్‌ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు పలుసార్లు గైర్హాజరు కావడంతో 22వార్డు కౌన్సిలర్‌, వైస్‌ చైర్మన్‌ కాళ్ల శకుంతలను, ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ పల్లంటి తారకేశ్వరిని గత కౌన్సిల్‌లో సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. తర్వాత ఇద్దరు లేఖ ఇవ్వడంతో సస్పెన్షన్‌ ఎత్తివేశారు. అయితే సోమవారం జరిగిన కౌన్సిల్‌లో వైస్‌ చైర్మన్‌ కాళ్ల శకుంతల టేబుల్‌ ముందు కౌన్సిలర్‌ అని బోర్డు పెట్టడంతో తొమ్మిదోవార్డు టీడీ పీ కౌన్సిలర్‌ టి.శ్రీనివాస సాహు అభ్యంతరం వ్యక్తంచేశారు. వైస్‌ చైర్మన్‌ టేబుల్‌ ముందు కౌన్సిలర్‌ బోర్డు పెట్టి అవమానించడం దారుణమని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. ఒకసారి సస్పెండ్‌ అయిన వ్యక్తికి వైస్‌చైర్మన్‌ అయినా తొలగించి మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని చైర్‌పర్సన్‌ తెలిపారు.

మున్సిపాల్టీ విషయంలో కలుగజేసుకోవద్దు

అధికారులపై విరుచుకుపడినట్లు నాపై ధ్వజమెత్తడం, మున్సిపాల్టీ విషయంలో కలుగజేసుకోవడం ఎమ్మెల్యేకు సరికాదని చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే అశోక్‌ మాట్లాడుతూ'నాలుగు మండలాలతో పాటు మున్సిపాల్టీ కూడా నా ఆధీనంలోనే ఉంటుంది. అంతా నా ప్రజలే. మీ ఇష్టానుసారంగా పాలిస్తే ఇక్కడ ఎవరూ ఊరుకోరు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని' అన్నారు. సుమారుగా 30 నిమిషాలపాటు ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే చెప్పడంతో వైఎస్‌ చైరపర్సన్‌ టేబుల్‌ ముందు కౌన్సిలర్‌ బోర్డు తొలగించి వైస్‌ చైర్మన్‌ బోర్డ్డు పెట్టడంతో గొడవ సర్దుమణిగింది.

నిధులు మూలుగుతున్నా పట్టించుకోరా....

మున్సిపాల్టీలో రూ.కోట్లు మూలుగుతు న్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని, ఈ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఎమ్మెల్యే అశోక్‌ ధ్వజమెత్తారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల నిధులున్నా మున్సిపాల్టీలో అభివృద్ధి పనులు చేసుకోని దుస్థితి నెలకొందని, ఇటువంటి మున్సిపాల్టీని ఎక్కడనూ ఇంతవరకు చూడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

30 ఏళ్లు కావస్తున్నా తాగునీరందివ్వరా

మున్సిపాల్టీ ఏర్పడి 30 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు 1, 2, 3 వార్డుల్లోని ఏఎస్‌పేట, పురుషోత్తపురానికి తాగునీరు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. వారు ప్రజలు కారాచ వారి తాగునీటి సమస్య పరిష్కరించరా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులున్నా ఎందుకు పైపులైన్‌ పనులు చేయడంలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

నిధులు వినియోగించడం తెలియదా... పైపులైన్‌ మరమ్మతులకోసం రూ10 లక్షలు నిధులున్నా వాటిని వినియోగించుకోవడం తెలియదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కనీసం బోర్లు వేసినా తాగునీటి సమస్య కొంతవరకైనా తీరేదికదాఅని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌ స్వయంగా కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసినా ఎందుకు ఇంతవరకు పనులు పూర్తి చేయలేదని అధికారులపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఆక్రమణలు అడ్డుకోండి మున్సిపల్‌ స్థలాలు ఆక్రమణలకు గురైనా ఎందుకుఅడ్డుకోవడంలేదని కౌన్సిలర్లు శ్రీనివాససాహు, నాగరాజుపాత్రో అధికారులుకు ప్రశ్నించారు. అనంతరం ఎజెండాలో పొందుపరిచిన 18అంశాలుపై చర్చ జరిగింది. కార్యక్రమంలో పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సుగణాకరరావు, డీఈ దక్షిణామూర్తి పాల్గొన్నారు.

Next Story
Share it