Top
Sneha TV

మరో ఐదు రోజులు చలిగాలుల ప్రభావం...వాతావరణశాఖ వెల్లడి

X

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు చేరడంతో పాటు పొగమంచు ప్రభావం వల్ల చలి గాలులు వీస్తున్నాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వణికిస్తున్న చలితో పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. చలిగాలుల ప్రభావం వల్ల ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, చండీఘడ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, మధ్యమహారాష్ట్ర, మరఠ్వాడ ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న చలిగాలులు ఈ నెల 6వతేదీ వరకు వీచే అవకాశం ఉందని స్కైమెట్ వెల్లడించింది. పర్యాటక ప్రాంతాలైన షిమ్లా, కుఫ్రీ, నార్కంద, డల్హౌసీ, మనాలీ ప్రాంతాల్లో మంచు కురిసిందని షిమ్లా వాతావరణశాఖ డైరెక్టరు మన్‌మోహన్‌సింగ్ చెప్పారు.

Next Story
Share it