Top
Sneha TV

దళితసత్తా ఆధ్వర్యంలో ఒక్కటైన ప్రేమ జంట

X
  • పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగింత

శృంగవరపుకోట, విజయనగరం: విజయనగరం జిల్లా జామి మండలంలో దళితసత్తాను ఆశ్రయించిన పశ్చిమ గోదావరి జిల్లా గుడిపాడు, పెదపాడు గ్రామాలకు చెందిన ప్రేమజంటకు దళిత నేత పెళ్లి చేశారు. దళితసత్తా జిల్లా అధ్యక్షుడు కొత్తలి గౌరినాయుడును విశాఖ జిల్లా సింహాచలం దేవాలయంలో హారిక- రాముకు పెళ్లి చేసి వారిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు, మండల పరిధిలోని పోలీసులకు విజయనగరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం అప్పగించారు. ఈ విషయమై గౌరినాయుడు మాట్లాడుతూ, తమ దళితసత్తాను నమ్మి వచ్చిన వారికి పెళ్లిచేశామని, వారి పెద్దలను రప్పించి పరిస్థితి వివరించామని చెప్పారు. అలాగే వారికి రక్షణ కల్పించాలనీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖరాశామన్నారు. ప్రతినిత్యం వారితో ఫోన్‌లో మాట్లాడుతూ, వారి యోగాక్షేమాలను కనుక్కునే ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రేమికులను కలిపి, వారి జీవీతాలు బాగుండేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు. కక్షలు పెంచుకుని హాని చేయవద్దని హితవు పలికారు.

Next Story
Share it