Top
Sneha TV

హెచ్‌డిసిఎల్‌ ప్రాజెక్టులపై సిఎస్‌ సమీక్ష

X

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డిసిఎల్‌) ఐదవ బోర్డు సమావేశం చీఫ్‌ సెక్రటరీ డా.ఎస్‌.కె.జోషి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రూ.231.50కోట్లతో సాలార్‌జంగ్‌ మ్యూజియం ఎదురుగా ఐకానిక్‌ పాదచారుల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేశారు. ఈ ప్రాజెక్టులో పాదచారుల ప్రాజెక్టుతో పాటు కులీకుతబ్‌షా కాంప్లెక్స్‌ వద్ద మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణం చేయనున్నారు. దీంతో పాటు ఫ్రూట్‌ వెండర్‌ కోసం ప్రత్యేకంగా బ్రిడ్జి నియామకం చేయనున్నారు. ఈపివి విధానంలో టెండర్లు పిలువాలని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కన్సల్టెంట్‌ రివైజ్డ్‌ లేవట్‌, ఆర్కిటెక్చర్‌ ప్లాన్‌తో డిటైల్డ్‌ ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలని సిఎస్‌ ఆదేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎయుడి ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, హెచ్‌ఆర్‌డిసిఎల్‌ చీఫ ఇంజనీర్‌ మోహన్‌నాయక్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story
Share it