Top
Sneha TV

లక్ష మందికి స్వీటు బాక్స్‌ల పంపిణీ

X

ప్రత్తిపాడు, తూర్పుగోదావరి: క్రిస్మస్‌ నూతన సంవత్సరాది సంక్రాంతి పండుగలను పురష్కరించుకుని ప్రత్తిపాడు నియోజకవర్గంలో లక్షకుటుంబాలకు స్వీటు బాక్స్‌లు, క్యాలండర్‌ల పంపిణీ కార్యక్రమం సోమవారంతో పూర్తయినట్లు డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా చెప్పారు. మండలంలోని పెదశంకర్లపూడి గ్రామంలో చైర్మన్‌ వరుపుల రాజా, ప్రత్తిపాడు గ్రామంలో ఏఎంసీ చైర్మన్‌ కొమ్ముల కన్నబాబు స్వీటు బాక్స్‌ల పంపిణీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ స్వీట్‌బాక్స్‌ల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయిందని సహకరించిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పర్వత సురేష్‌, టీడీపీ నాయకులు జల్లిగంపల ప్రభాకర్‌ రావు, యాళ్ల జగదీష్‌, యాళ్ల విశ్వేశ్వరరావు, ఎర్రాబత్తుల గోవింద నాయుడు, రావూరి తాతాజీ, పోలిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it