Top
Sneha TV

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఖాదర్‌ ఖాన్‌ మృతి

X

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, మాటల రచయిత ఖాదర్‌ ఖాన్‌ (81) కెనడాలో మంగళవారం మృతి చెందారు. ఈ వార్తను ఆయన కుమారుడు సర్ఫరాజ్‌ ఖాన్‌ ధ్రువీకరించారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కెనడాలోని ఓ ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటి నుండి ఆయన సరిగా నడవలేకపోతున్నారు. 90 దశకంలో ఎక్కువగా గోవిందా, అనిల్‌ కపూర్‌తో కలిసి నటించారు. 300 కు పైగా చిత్రాల్లో నటించారు. 250 సినిమాలకు మాటల రచయితగా కూడా పనిచేశారు.

Next Story
Share it