Top
Sneha TV

యుపిలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్న 42 మంది అరెస్ట్‌

X

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ జిల్లాలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్నారన్న ఆరోపణలపై 42 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బుధానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జోలా గ్రామంలో చట్టవిరుద్ధ ఆయుధ తయారీ యూనిట్లపై దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సోమవారం ఆయుధాలను తరలిస్తురన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో వెలుగుచూశాయని అధికారి ఒకరు తెలిపారు. ఖటోలీ పట్టణంలోని ఒక ఇంటిపై దాడి చేసి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు .. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Next Story
Share it