Top
Sneha TV

తెలంగాణ కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్

X

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దు చేసింది. షబ్బీర్‌ అలీకి ప్రతిపక్ష నాయకుడి హోదా రద్దు చేస్తూ గెజిట్‌ జారీ చేశారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఆకుల లలిత ఆధ్వర్యంలో నలుగురు ఎమ్మెల్సీలు.. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వెనువెంటనే టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా చేజారిపోయింది.

మరోవైపు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి.. కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలు రాములు నాయక్, కొండా మురళీ, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. వీరిపై కూడా అనర్హత వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Next Story
Share it