Top
Sneha TV

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా: హరీశ్ రావు

X

సిద్దిపేట: ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభకు హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. "చరిత్ర పుటల్లో నిలబడే ఎన్నిక ఈ అసెంబ్లీ ఎన్నిక. సిద్దిపేట ప్రజలు, కార్యకర్తలు చాలా గొప్పవారు. పలు నియోజకవర్గాల్లో నేను పని చేసినా.. అద్భుత మెజార్టీతో నన్ను గెలిపించారు. టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉంది. వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని గ్రామాలను ఏకగ్రీవం చేసుకుందాం. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేర్చుకుందాం. చెరువులు, కుంటలు నిండిన నాడే మన గెలుపునకు నిజమైన సార్థకత. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాం. వివిధ రాష్ర్టాల నుంచి సిద్దిపేట జిల్లాలోని పల్లెలను చూసేందుకు వస్తున్నారు. మన అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారు.." అంటూ హరీశ్ రావు స్పష్టం చేశారు.

Next Story
Share it