Top
Sneha TV

గ్రూప్ 2 అన్ని సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ...!

X

తెలంగాణ రాష్ట్రం లో గ్రూప్ 2 పరీక్షా జరగడం తో ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభ్యర్దులకు ఆ రోజు రానే వచ్చింది. ఫిబ్రవరి 26 న ఈ పరీక్షా కు అన్ని సిద్ధం చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం ఈ పరీక్షకు అయిదు లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్టు సమాచారం.

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా పరీక్ష నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లో 86 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షల రాయనున్నారని తెలుస్తుంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.

982 పోస్టులకు గాను ఈ గ్రూప్ 2 పరీక్ష జరుగుతోంది.

లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం పరీక్షకు హాజరవుతున్నారు. ఏపీ లో మరిన్ని నోటిఫికెషన్స్ పడేలా చూస్తున్నామని , ఏపీ లో నిరుద్యోగులంటూ లేకుండా చేస్తామని అంటున్నారు.

Next Story
Share it