Top
Sneha TV

టీఆర్‌ఎస్‌ గెలిస్తే జగన్‌ సంబరాలు చేసుకుంటున్నారు: చంద్రబాబు

X

శ్రీకాకుళం: టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రతిపక్ష నేత జగన్‌ సంబరాలు చేసుకుంటున్నారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. పులివెందులకు నీళ్లు రావడం జగన్‌కు ఇష్టంలేదని మండిపడ్డారు. తుపాను బాధితులను జగన్‌ పరామర్శించలేదని ఆరోపించారు. కేంద్రాన్ని వైసీపీ అధినేత ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. వైసీపీ, పవన్‌ పార్టీలకు లాలూచీ రాజకీయాలు అవసరమని, టీడీపీకి లాలూచీ రాజకీయాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారం కాదని, ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. సీబీఐ, ఆర్‌బీఐని నిర్వీర్యం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఎవరిని బతకనివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని, ఎన్నికల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. పేపర్‌ బ్యాలట్లే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వాడట్లేదని చంద్రబాబు తెలిపారు.

Next Story
Share it