Top
Sneha TV

లక్కిరెడ్డిపల్లెలో విశ్వ భారతి విద్యా సంస్థల భారీ ర్యాలీ

X

లక్కిరెడ్డిపల్లె : విశ్వ భారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లె పట్టణంలో శుక్రవారం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. లక్కిరెడ్డిపల్లె పట్టణంలో ఉన్న విశ్వ భారతి విద్యా సంస్థలకు 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాఠశాలలో ఈ నెల 22, 23 తేదీలలో (రేపటి నుండి) రజతోత్సవ సంబరాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు 500 మంది విద్యార్థులతో కలిసి రిహార్సల్స్‌ భారీ ర్వాలీ చేపట్టామన్నారు. ర్యాలీ అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు సాంస్కఅతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం రవి, గంగరాజు, ఉపాధ్యాయులు ధనకుమార్‌, తిలక్‌, తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it