Top
Sneha TV

ఎన్నికల కమిషన్‌పై టీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

X

సంగారెడ్డి: ఎన్నికల కమిషన్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌ కేసీఆర్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు సహకరించారని విమర్శించారు. ఆందోల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో దామోదర రాజనర్సింహ ఈ వ్యాఖ్యలు చేశారు. 22 లక్షల మంది కొత్త ఓటర్లను మోసం చేశారని ధ్వజమెత్తారు. పాత ఓటర్‌ లిస్ట్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించారని వ్యాఖ్యానించారు. రైతులకు, పథకాలకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని రాజనర్సింహ చెప్పుకొచ్చారు.

Next Story
Share it