Top
Sneha TV

విభజన హామీలపై కేంద్రమంత్రులను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

X

ఢిల్లీ: విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ కేంద్రమంత్రులను టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. విభజనచట్టం అమలుపై కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్‌, రవిశంకర్ ప్రసాద్‌ను టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిసి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు ఇవ్వాలని జైట్లీని కోరామని తెలిపారు. అలాగే రైల్వే పెండింగ్ అంశాలు, పలు రైళ్ల స్టాప్‌లపై పీయూష్ గోయల్‌తో చర్చించామన్నారు. ఇక హైకోర్టు విభజన ఆలస్యంపై మరోసారి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిశామన్నారు. హైకోర్టు విభజనలో ఆలస్యం ఉండదని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని వినోద్ పేర్కొన్నారు.

Next Story
Share it