Top
Sneha TV

హైదరాబాద్‌లో విద్యార్ధులపై పోలీసుల దాడి

X

హైదరాబాద్ : హైదరాబాద్ బోయిన్ పల్లిలో పోలీసులు రెచ్చిపోయారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న యువకులపై ఖాకీలు తమ ప్రతాపాన్ని చూపించారు. రెండురోజుల పాటు లాకప్ లో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. దెబ్బలకు తాళలేక తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్ధులమని చెప్పినా విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాక్షసుల్లా ప్రవర్తించిన వీరిని, ఫ్రెండ్లీ పోలీసులంటారా అని ప్రశ్నిస్తున్నారు.

Next Story
Share it