Top
Sneha TV

జనవరి ఆరు.. చంద్రబాబుకి 'డెడ్‌లైన్'!

X

ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా నడుస్తున్న టీడీపీ-బీజేపీ పొలిటికల్ ఎపిసోడ్.. త్వరలో కొత్త టర్న్ తీసుకోనుంది. ఎన్డీఏ నుంచి బైటికొచ్చి బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ.. మోదీ టార్గెట్‌గా జాతీయ రాజకీయాల్లో కూడా వేలు పెట్టేశారు చంద్రబాబు. ఇటు.. బీజేపీ వైపు నుంచి కూడా చంద్రబాబు సర్కార్ మీద యుద్ధం లాంటిదే జరుగుతోంది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎప్పుడూ విరుచుకుపడ్తుంటే.. ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అప్పుడప్పుడూ వచ్చి చురకలేసి పోతున్నారు. ఇది చాలదన్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ బాబు పనితీరును ఎండగడుతూనే వున్నారు.

ధర్మపోరాట దీక్షల పేరుతో తెలుగుదేశం చేస్తున్న దాడిని లోకల్ కమలనాధులు ఎంతో కొంత తిప్పికొడుతూనే వున్నా.. ఇది సరిపోవడం లేదు. అందుకే.. జనవరి ఆరవ తేదీతో చంద్రబాబు కథ తేలిపోతుందని, ఆ తర్వాత నుంచి అసలు సినిమా కనిపిస్తుందని హెచ్చరిస్తోంది బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి. ఆ రోజున ప్రధాని మోదీ గుంటూరుకొచ్చి ప్రజా చైతన్య సభలో ప్రసంగిస్తారు. నాలుగున్నరేళ్లలో కేంద్రం ఏపీకి ఏమేం చేసింది.. ఏపీ ప్రజానీకం ఆదరణ ఎలా చూరగొంటామన్నది ఆయన వివరిస్తారట. దీంతో.. తెలుగు తమ్ముళ్ల నోళ్లు మూత పడతాయని. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారానికి చెక్ పడుతుందని చెబుతున్నారామె.

ఇప్పటికే ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. బీజేపీ ఎన్నికల ప్రచారానికి జనవరి 6 మోదీ సభ మొదటిమెట్టు కానుంది. కానీ.. స్పెషల్ స్టేటస్ ఎక్కడకు పోయింది.. అమరావతికి ఇస్తామన్న నిధులెక్కడ లాంటి అంశాల మీద కూడా మోదీ క్లారిటీ ఇవ్వక తప్పదు. తనను మితిమీరి విమర్శిస్తున్న చంద్రబాబును ఈసారి మోదీ ఉపేక్షిస్తారా లేక.. అదే స్థాయిలో విరుచుకుపడతారా అనేది సస్పెన్స్. ఏదేమైనా గుంటూరు సభలో మోదీ చెయ్యబోయే ప్రసంగం స్క్రిప్ట్ ఏపీ రాజకీయాల్లో చాలా కీలకం కానుంది!

Next Story
Share it