Top
Sneha TV

ప్రభాస్ భూవివాదంలో కొత్త ట్విస్ట్

X

నటుడు ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును డివిజన్ బెంచ్‌కి బదిలీ చేసింది న్యాయస్థానం. తనకు నోటీసులు ఇవ్వకుండానే గెస్ట్‌ హౌస్‌ను అధికారులు సీజ్‌ చేయడంపై హైకోర్టును ఆశ్రయించాడు ప్రభాస్. ఈ వ్యవహారంపై బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. సీఎస్/7లో భూమి ఉందా? లేదా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇది రాయదుర్గంలోని పాన్‌మక్త స్థలమని, దీన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభాస్ కొనుగోలు చేశారని ఆయన తరపు లాయర్ సమాధానం ఇచ్చారు. వెంటనే ప్రభుత్వ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని పాన్ మక్తలో భూమి ప్రభుత్వానిదేనని గతంలో న్యాయస్థానం తీర్పు నిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గతంలో డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో, ప్రభాస్ పిటిషన్‌ను దానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం తాము వాదనలు వినిపిస్తామని తెలిపారు. దీంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది న్యాయస్థానం

Next Story
Share it