Top
Sneha TV

కొత్త సంవత్సరం శాంతియుతంగా జరుపుకోవాలి..

X

హైదరాబాద్ : కొత్త సంవత్సరాన్ని ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు గైడ్ లైన్స్ రూపొందించారు. ఈ విషయమై సీపీ మాట్లాడుతూ..పార్కింగ్ స్థలాల్లో హోటల్ యాజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదు. ఈవెంట్ ఆర్గనైజర్లు విధిగా బౌన్సర్లను నియమించుకోవాలి. 45 డెసిబుల్స్ కంటే సౌండ్ బాక్స్ మించరాదని చెప్పారు. వీధుల్లో అశ్లీల నృత్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమని సీపీ హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగంపై నిషేధం అమలులో ఉందన్నారు. ఈ నెల 21న రాష్ట్రపతి రామ్ కోవింద్ హైదరాబాద్ వస్తున్నారని అన్నారు.

Next Story
Share it