Top
Sneha TV

లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

X

ముంబయి: ఈరోజు కూడా దేశియ సూచీలు లాభాలతోనే ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 90 పాయింట్లకు పైగా లాభంతో ట్రెడింగ్‌ను ప్రారంభించగా. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాలతో పయనించడం వల్ల సెన్సెక్స్‌ జోరుగా కొనసాగింది. సెన్సెక్స్‌ 137.25 పాయింట్లు లాభాపడి 36,484,33 వద్ద ముగిసింది. ఆటు నిఫ్టి కూడా 58.60 పాయింట్లు లాభాపడి 10,967.30 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.35 వద్ద కొనసాగుతోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు భారీ లాభాలను గడించాయి. హెచ్‌సీఎల్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలో ఉన్నాయి.

Next Story
Share it