Top
Sneha TV

ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరికలు సంతోషం: కేటీఆర్‌

X

హైదరాబాద్: ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరికలు సంతోషమని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాములునాయక్‌ పార్టీలో చేరారని, వైరా నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, రాబోయే రోజుల్లో గులాబీ జెండా అన్ని నియోజకవర్గాల్లో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు.

''తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం. మిషన్‌ భగీరథ పనులు 95 శాతం పూర్తి. త్వరలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇంటింటికి తాగునీరు ఇచ్చే రాష్ట్రంగా రికార్డు సృష్టించబోతున్నాం. రాష్ట్రంలో బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్‌ రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండు ఒకటే. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిపించాలి. కేంద్రాన్ని శాసించి హక్కులు సాధించుకుందాం'' అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Next Story
Share it