Top
Sneha TV

ఇంటి బాత్‌రూంలో ఎలుగుబంటి..తాళ్లతో బంధించి..

X

రాజన్న సిరిసిల్ల: బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఆర్‌అండ్‌కాలనీలోని ఇంటి బాత్ రూంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటిని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో వేములవాడ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. ఎలుగుబంటిని తాళ్లతో బంధించారు. అయితే ఎలుగుబంటి ఆరోగ్యం బాగానే ఉందని, ఫాజుల్ నగర్ ఫారెస్టు ఏరియాలో వదిలివేశామని అధికారులు తెలిపారు.

Next Story
Share it