Top
Sneha TV

నందమూరి ఫ్యామిలీ.. మళ్లీ మోసపోయిందా..?

X

ఏపీ సీఎం చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందట . అతడిని నమ్మి గతంలో ఎన్టీఆర్ దారుణంగా మోసపోతే .. ఇప్పుడు బంధులు కూడా బాబు కారణంగా పరువు పోగొట్టుకుంటున్నారట . ఈ మాటలు అన్నది ఎవరో కాదు .. ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీ పార్వతి .కూకట్ పల్లి స్థానంలో టీడీపీ పోటీ చేస్తే ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసని లక్ష్మీ పార్వతి ఆరోపించారు . తెలిసి .. తెలిసి .. చంద్రబాబు కావాలనే కూకట్ పల్లి స్థానాని నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి ఇచ్చారని లక్ష్మీ పార్వతి అంటున్నారు . చంద్రబాబు ఎన్నికల జిత్తుల కారణంగా నందమూరి కుటుంబం మరోసారి పరువు పోగొట్టుకుందని ఆమె అంటున్నారు .రేపు ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబును జనం చీకొట్టడం ఖాయమని ఆమె ధీమాగా చెబుతున్నారు . టీడీపీ ప్రభుత్వంలో భారీగా దోపిడీ జరగుతోందని .. రాజధాని , నీటి ప్రాజెక్టులలో అవినీతి ఏరులై పారుతోందని లక్ష్మీపార్వతి ఆరోపిస్తున్నారు . ఏపీ సర్కారులో జరుగుతున్న అవినీతి చంద్రబాబు కింద పని చేసి రిటైరైన అధికారులు రాస్తున్న పుస్తకాలే నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు .వాస్తవానికి నందమూరి కుటుంబాన్ని అనూహ్యంగానే కూకట్ పల్లి రాజకీయాల్లోకి దింపారు చంద్రబాబు . టికెట్ కేటాయింపుల విషయంలో హఠాత్తుగా సుహాసిని పేరు తెరపైకి వచ్చింది . చంద్రబాబు నిర్ణయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు అంత సుముఖంగా లేకపోయినా వ్యతిరేకించడం ఇష్టం లేక ఊరుకొండిపోయారు . అందుకే ఆయన ప్రచారానికి కూడా రాలేదు .

Next Story
Share it