Top
Sneha TV

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్: 'ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్ర ఉంటుంద

X


సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓ పాత్రికేయురాలు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. "దేశ రాజకీయల్లో మాకు ఆసక్తి ఉంది. దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్భాగం కాబట్టి, ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ మాకు ఆసక్తి ఉంది. అక్కడ వచ్చే ఓట్లు, సీట్లు, దేశంలో మంచి మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక బలమైన ప్రాంతీయ శక్తి ( పార్టీ) గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఆ పార్టీలు దేశానికి చేయకూడనంత విధ్వంసం చేశాయి. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌ను కూడా ఒక ప్రాంతీయ పార్టీనే పాలించాలి" అని కేటీఆర్ అన్నారు.

జగన్, చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్‌తోనూ తమకు ఎలాంటి తగాదా లేదని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో తప్ప, వ్యక్తిగతంగా తమకు ఎవరితోూ శత్రుత్వం లేదన్నారు.

"ఆంధ్రప్రదేశ్‌కు ఏ పార్టీ రావాలో అక్కడి ప్రజలు నిర్ణయించుకోవాలి. అయితే, వారికి ఏది మేలు చేస్తుందో మేము తప్పకుండా అక్కడి ప్రజలకు సమయం వచ్చినప్పుడు మేము చెబుతాం" అని వివరించారు.

ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వ నిర్వహణలో, జాతీయ స్థాయిలో తెరాస ప్రభావంతమైన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతోనే తనకు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్‌ అప్పగించారని చెప్పారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 చోట్ల టీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. అప్పుడు, దేశ ప్రధానిని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి తెలంగాణకు వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా రావాలంటే తమ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందన్నారు.

Next Story
Share it