Top
Sneha TV

జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

X

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌కు జగన్‌ మద్దతివ్వడం నవ్యాంధ్ర ప్రజలను వంచించడమేనని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న కేసీఆర్‌కు ఎందుకు మద్దతిస్తున్నారు? అని లేఖ ద్వారా జగన్ ను ప్రశ్నించారు. తెలుగు తల్లిని కించపరిచిన కేసీఆర్‌కు మద్దతివ్వటం సిగ్గుగా అనిపించట్లేదా?..హోదాకు అడ్డుపడ్డ టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో చెవిరెడ్డి, విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారన్నారు. కూకట్‌పల్లిలో గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ బహిరంగ ప్రకటన చేయటం వాస్తవం కాదా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేయటమే వైసీపీ రహస్య అజెండానా? అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it