Top
Sneha TV

అంబానీ ఇంట్లో వివాహ వేడుకకు బయల్దేరిన ఏపీ సిఎం చంద్రబాబు

X

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు బయల్దేరారు. గన్నవరం విమనాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ముంబయికి చేరుకోనున్నారు. ఈశా అంబానీ- ఆనంద్‌ పిరమాల్‌ల వివాహానికి ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేశారు. ముంబయిలోని అంబానీ నివాసం యాంటీలియాలో ఈ రోజు రాత్రి వీరి వివాహం జరగనుంది. ఇందుకోసం యాంటీలియాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ వివాహానికి దాదాపు 600 మంది అతిథులు రానున్నారు. అంబానీ, పిరమాల్‌ కుటుంబ సభ్యులు, ఉన్నత హోదాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు, అతి కొద్ది మంది బాలీవుడ్‌ ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు రానుండటంతో పెడ్డర్‌ రోడ్‌లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story
Share it