Top
Sneha TV

కేసీఆర్‌ ఏపీకి వస్తే స్వాగతిస్తాం.. ఏపీ మంత్రి సంచలన ప్రకటన

X

అమరావతి: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఏపీకి వస్తే స్వాగతిస్తామని, ఆయన దేశంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాల వల్లే టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని తెలపారు. రాష్ట్రం ముక్కలు కావడానికి కేసీఆర్‌ కారణమని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీ, జనసేన అధినేత పవన్ సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్ కనీసం పోటీ కూడా చేయలేదని, పవన్‌ అటు వైపు చూడలేదన్నారు. జగన్, పవన్ రాజకీయాలు మానుకోవాలని, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారని ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాటం చేస్తోన్న చంద్రబాబుని విమర్శిస్తున్నారని, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ అభివృద్ధిని ఆదినారాయణరెడ్డి చెప్పారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ హాట్‌టాఫిక్‌గా నిలుస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ సాధించిన విజయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతకంటే ముఖ్యంగా తాను ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకుంటానని కేసీఆర్ చెప్పడం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. తిరిగి బుధవారం మీడియాతో మాట్లాడుతూ తనను ఆంధ్రాకు రమ్మని పిలుస్తున్నారని, వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు.

అయితే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్‌పై సీఎం చంద్రబాబు స్పందించారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా కేసీఆర్ ప్రకటనపై తనదైన శైలిలో స్పంధించారు. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే తమకే లాభమని అభిప్రాయపడ్డారు. రైతులను మెప్పించినవారిదే అధికారమని, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చాలా చేశారని కొనియాడారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా రైతులకు పంట పెట్టుబడి ఇచ్చారని ఆయన చెప్పారు.

Next Story
Share it