Top
Sneha TV

ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్‌ను ఆహ్వానించిన గవర్నర్

X

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేశారు. సీఎంగా కేసీఆర్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అనంతరం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఎన్నుకున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి లేఖ అందజేశారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్‌ను గవర్నర్ ఆహ్వానించారు. ఈసీ గెజిట్ విడుదల చేస్తే నాతో పాటు ఒకరు ప్రమాణస్వీకారం ఉంటుందని కేసీఆర్ వివరించారు. మరో ఐదారు రోజుల్లో పూర్తిస్థాయిలో అందరి ప్రమాణస్వీకారం ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు.

Next Story
Share it