Top
Sneha TV

డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఐదుగురు ప్రముఖులు

X

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ దుందుభి మోగిస్తోంది. 2014 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో రెండోసారి గులాబీ పార్టీయే అధికారం కైవసం చేసుకుంది. కాగా ఇదే ఎన్నికల్లో మరో ఘనత చోటు చేసుకుంది. ఐదుగురు అభ్యర్థులు వరుసగా ఆరుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు.
సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు, పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్, బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వరుసగా ఆరుసార్లు గెలిచారు. పైగా వీరంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం విశేషం.

కాగా ఈ ఎన్నికల్లో నలుగురు మంత్రులు పరాజయం పాలయ్యారు. తుమ్మల, జూపల్లి, మహేందర్‌రెడ్డి, చందూలాల్‌ ఈ ఎన్నికలో ఓడి పోయారు. వీరితో పాటు శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి సైతం ఓడిపోయారు.

Next Story
Share it