Top
Sneha TV

ప్రజాకూటమి ఓటమిపై జానారెడ్డి స్పందన...

X

హైదరాబాద్: దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడడం.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని, దానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. ప్రజా కూటమి ఓటిమిపై స్పందించిన ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలపై సమీక్ష జరిపి మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల కృషి చేసిందని.. దానిలో భాగంగా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నానని, పదవి ఆశించికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం ప్రజలకు, మీడియాకు గుర్తు చేస్తున్నానని జానారెడ్డి పేర్కొన్నారు.

Next Story
Share it