Top
Sneha TV

అదిలాబాద్: ఆసిఫాబాద్ కౌంటింగ్‌లో గందరగోళం

X

అదిలాబాద్: ఆసిఫాబాద్‌లో తుది ఫలితం వెల్లడించడానికి ముందు కాస్త గందరగోళం చోటుచేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు, టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మిపై 171 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. అయితే తుది ఫలితం ప్రకటించడానికి ముందు హైడ్రామా చోటు చేసుకుంది. ఆసిఫాబాద్‌లోని 214 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు కౌంటింగ్ నిలిపివేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వివి ప్యాట్‌లోని స్లిప్‌లను లెక్కించారు. ఆ తర్వాత తుది ఫలితం ప్రకటించారు. 171 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచినట్లు ప్రకటించారు.

Next Story
Share it