Top
Sneha TV

బ్యారెక్ నెంబర్ 12 : ముంబై ఆర్థర్ రోడ్ జైలుకి మాల్యా

X

ముంబై: ఇండియాలోని బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ వెళ్లిపోయిన మాల్యాను అప్పగించాలంటూ భారత్ చేసిన పోరాటం ఫలించింది. డిసెంబర్ 10వ తేదీ భారత దౌత్యవేత్తల వాదనలు విన్న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు భారత్‌కు మాల్యాను అప్పగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ముందు కోర్టులో ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. భారత్‌లోని జైళ్లపై మాల్యా అసంతృప్తి వ్యక్తం చేయటంతోపాటు అక్కడ ఉండలేం అని స్పష్టం చేశారు. దీంతో ముంబైలోని ఆర్థర్ జైలులోని బ్యారక్‌లపై 10 నిమిషాల వీడియోను భారత అధికారులు కోర్టుకు సమర్పించారు.
ఆర్థర్ రోడ్ జైలు బ్యారక్ నెంబర్ 12 :
ముంబైలోనే అతిపెద్ద జైలు ఆర్థర్ రోడ్‌లో ఉంది. ఈ జైలు ఆవరణలో రెండు అంతస్తుల భవనం ఉంది. అందులో బ్యారక్ నెంబర్ 12 మాల్యా కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు అధికారులు. సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది ఈ బ్యారక్. అనారోగ్యం వస్తే వెంటనే పరీక్షించటానికి దగ్గరలోనే క్లీనిక్ కూడా ఉందని అధికారులు కోర్టుకి వివరించారు. వెస్టర్న్ టాయ్‌లెట్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రకృతి సిద్ధంగా గాలి, వెలుతురు చక్కగా బ్యారక్‌లోకి వస్తాయని.. మాల్యాను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాం అంటూ కోర్టుకి వివరించారు. భారత అధికారులు సమర్పించిన వీడియోలు, డాక్యుమెంట్లు పరిశీలించిన లండన్ కోర్టు.. మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Next Story
Share it