Top
Sneha TV

'ఒక్క ఫోన్‌ చేస్తే తెరాస నేతలు అమ్ముడుపోతారా?'

X

తెరాస నేతల ఆరోపణలను ఖండించిన విశ్వేశ్వర్‌ రెడ్: తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూలు తెరాస అభ్యర్థి జనార్దన్‌రెడ్డే తనకు ఫోన్‌ చేశారని, ఒక ఫోన్‌ చేస్తేనే తెరాస నేతలు అమ్ముడు పోతారా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి నేతలను ప్రలోభ పెట్టే అలవాటు కాంగ్రెస్‌కు లేదన్నారు. 63 మంది గెలిచిన తెరాసలో ఈరోజు 90 మంది సభ్యులు ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఫోన్‌ చేసినంత మాత్రాన బేరసారాలకే అని ఎందుకు అనుకుంటారని అన్నారు. ఫోన్‌ చేసిన మాట వాస్తవమేనని.. ఓటింగ్‌ గురించి మాత్రమే అడిగానన్నారు. తాను సీ ఓటర్‌, లగడపాటి సర్వేలను మాత్రమే నమ్ముతానని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. తెరాస ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనందునే.. ఎంఐఎంతో చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు.
చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి తనను ప్రలోభాలకు గురిచేశారని నాగర్‌కర్నూలు తెరాస అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తనను కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన అడిగితే అందుకు తాను తిరస్కరించానంటూ మీడియాకు వెల్లడించడం కలకలం రేపింది.

Next Story
Share it