Top
Sneha TV

టీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కొండా కౌంటర్

X

హైదరాబాద్:

టీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లన్నీ ట్యాపింగ్‌లో ఉన్నాయన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదని, ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన అమ్ముడుపోతారా? అని విశ్వేశ్వర్‌రెడ్డిప్రశ్నించారు. 9000444777, 9030899999 ఈ నెంబర్స్‌ నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వచ్చాయని, ఇవి మర్రి జనార్థన్‌ రెడ్డి నెంబర్లని ఆయన చెప్పారు. మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని విశ్వేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తనకు మర్రి జనార్థన్‌రెడ్డి ఒక్కడితోనే కాదని, 50 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో మంచి సంబంధాలున్నాయని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. లైవ్ మీ కోసం...

Next Story
Share it