Top
Sneha TV

ఏపీలో లక్ష నకిలీ ఓట్లను తొలగించాం: సిసోడియా

X

అమరావతి: ఏపీలో 3.72కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, లక్ష నకిలీ ఓట్లను తొలగించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఓటరు జాబితాలపై అపోహలు వద్దని, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి అమోదం లేకుండా ఓటు తొలగించరని చెప్పారు. ఓట్ల గల్లంతుపై రాజకీయ పార్టీల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వారం పాటు ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించామని ఆయన పేర్కొన్నారు. 175 నియోజక వర్గాలలో ఓటరు జాబితా పక్కాగా తయారీ చేశామని, తెలంగాణలో మాదిరిగా ఓట్లు గల్లంతు కాకుండా పక్కా చర్యలు తీసుకుంటామని సిసోడియా తెలిపారు.

Next Story
Share it