Top
Sneha TV

మోదీ లేకపోతే చంద్రబాబు జీరో: సోము వీర్రాజు

X

గుంటూరు:

ప్రధాని మోదీ లేకపోతే చంద్రబాబు జీరో అని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. నగరంలో నిర్వహించిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన.. సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రధాని మోదీ పరిపాలనతో టీడీపీ కనుమరుగు అవుతుందనే భయంతోనే.. ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సహకారం లేకుండా చంద్రబాబు ఎప్పుడు సీఎం కాలేదని విమర్శించారు. బాబు వల్లే వాజ్‌పేయ్ ఓటమి చవి చూశాడని చెప్పారు. చంద్రబాబుది ఓ ప్లాప్ షో అని, రాష్ట్రంలో మాదిరే దేశంలో కూడా ఆయన విఫలం అవుతాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఊహించిన దానికి విరుద్ధంగా ఏపీలో రాజకీయాలు జరగబోతున్నాయని జోస్యం చెప్పారు. మంగళవారం విడుదలయ్యే ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 6న ఏపీలో ప్రధాని మోదీ పర్యటిస్తారని స్పష్టం చేశారు. మోదీ సభ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడతామని సోము వీర్రాజు వెల్లడించారు.

Next Story
Share it