Top
Sneha TV

తెలంగాణలో కర్ణాటక ఫార్మూలా

X

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కర్ణాటక తరహా ఫార్మూలాను అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్ధులను దారిలోకి తెచ్చుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతుంది. ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుండటంతో.. రేపు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగనున్నారు. ఒకవేళ ఏ పార్టీకి కూడ పూర్తిస్థాయిలో మెజారిటీ రాకపోతే టీఆర్ఎస్‌ అధికారంలోకి రాకుండా అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యూహన్ని సిద్దం చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్‌తో సహా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తదితరులు హైదరాబాద్‌కు రానున్నారు. కర్ణాటకలో విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌ , జేడీఎస్‌ శాసనసభ్యులు బీజేపీ వైపునకు వెళ్లకుండా చేయడంలో డీకే శివకుమార్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకేను తెలంగాణలో రంగంలోకి దింపడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వేళ హంగ్‌ ఏర్పడితే డీకే ఎలాంటి వ్యూహం అనుసరించనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే టీఆర్ఎస్ కు మజ్లిస్‌ పార్టీ మద్దతు ప్రకటించడం.. సీఎం కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ కావడంతో కాంగ్రెస్‌ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో సుమారు ఎనిమిది మందికి పైగా ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నలుగురు ఇండిపెండెంట్లతో కాంగ్రెస్ పార్టీ రాయబారాలు నడుపుతుంది. జలంధర్ రెడ్డి, రాములు నాయక్, శివకుమార్ రెడ్డితో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థితో చర్చించారు. ఈ నలుగురిని కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాంప్‌కు పంపే అవకాశం ఉంది.

Next Story
Share it