Top
Sneha TV

డబుల్ డిజిట్ సాధిస్తాం: కిషన్ రెడ్డి

X

హైదరాబాద్:

రేపటి ఫలితాల్లో డబుల్ డిజిట్ సాధించగలమనే ఆశతో ఉన్నామని బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. ఫలితాల తర్వాత క్రియాశీలక పాత్ర పోషించబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అనేక నియోజక వర్గాల్లో బీజేపీ మంచి పోటీ ఇచ్చిందని అన్నారు. తెలంగాణలో పార్టీ బలపడాలని, టీఆర్ఎస్, మహాకూటమికి సమాంతరంగా బీజేపీ బలపడాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి.. అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా లక్ష్మణ్ తన అభిప్రాయం చెప్పడం తప్పుకాదని కిషన్ రెడ్డి అన్నారు. తమది కుటుంబ పార్టీ కాదని, అధిష్టానం ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story
Share it