Top
Sneha TV

కేంద్రమంత్రిపై థరూర్‌ పరువు నష్టం దావా

X

దిల్లీ:

న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్ మీద కాంగ్రెస్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ సోమవారం పరువు నష్టం దావా వేశారు. 'హత్య కేసులో నిందితుడు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ కేరళలోని తిరువనంతపురం న్యాయస్థానంలో ఈ కేసు దాఖలు చేశారు. అక్టోబర్ 28న ఓ మీడియా సమావేశంలో మంత్రి ఈ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రసాద్ ఈ పదం వాడారు. ఆ వెంటనే శశిథరూర్‌ న్యాయశాఖ మంత్రికి నోటీసులు పంపించారు. 'భారత న్యాయశాఖ మంత్రి తన రాజకీయ ప్రత్యర్థి మీద హత్యా నేరం మోపుతున్నారు. న్యాయం, ప్రజాస్వామ్యం మీద ఇక నమ్మకం ఎక్కడుంటుంది?' అని నోటీసులు పంపించిన సందర్భంగా థరూర్‌ విమర్శలు చేశారు.

శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ 2014లో ఓ విలాసవంతమైన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Next Story
Share it