Top
Sneha TV

వైసీపీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు

X

అమరావతి:

వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీలను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ సంక్షేమంపై ప్రతిపక్ష నేత జగన్‌ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీసీలు ఎప్పటికీ టీడీపీ వెంటే ఉంటారని, వైఎస్ కుటుంబం బీసీలను అణగదొక్కిందని మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్నా బీసీ సబ్ ప్లాన్ కు నిధులిచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Next Story
Share it