Top
Sneha TV

ఫ్రొఫెసర్ ఆఖరి హామీ

X

తెలంగాణలో ప్రజాకూటమి అనూహ్య పుంజుకొంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు వెళ్లినప్పడు.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందనే టాక్ ఉండేది. ఐతే, ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ కాంగ్రెస్, టీ టీడీపీ, టీజెఎస్, సీపీఐ లు ప్రజా కూటమిగా ఏర్పడంతో సీన్ మారింది. రాహుల్, సోనియాగాంధీ, చంద్రబాబు ప్రచారంతో ప్రజాకూటమి రేసులోకి దూసుకొచ్చింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఈరోజున ప్రజా కూటమి గెలుపుకే అవకాశాలెక్కువ అనే పరిస్థితి నెలకొంది.

ఐతే, ఈ మొత్తం వ్యవహారం ప్రొ. కోదండరామ్ కోలక పాత్ర పోషించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో జోరు చూపించకపోయినా.. ప్రజా కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాజకీయ జేఏసీ నడిపిన అనుభవంతో ప్రజాకూటమిలో కీలక భూమిక పోషించారు. ఇక, ప్రజా కూటమితరుపున హామీల అములు చేసే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు.కోదండరాం హామీతో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగుల ఓట్లు ప్రజాకూటమికి గప్పగుత్తగా పడే అవకాశాలు కనబడుతున్నాయి.

Next Story
Share it