Top
Sneha TV

అమావాస్య కలిసొచ్చేదెవరికో!

X

హైదరాబాద్:

గీనెల ఏడున శుక్రవారం అమావాస్య గ పార్టీల అభ్యర్థులకు ఏమేరకు కలిసివచ్చి విజయలక్ష్మి వరిస్తుందోనని రచ్చబండ వద్దకు చేరుకొన్న రంగయ్య అక్కడే ఉన్న మల్లయ్యతో మాట కలిపాడు. ఇద్దరూ ఆసక్తికర సంభాషణకు తెరలేపారు. గీ ఓటింగ్‌ రోజున అమావాస్య ఉందంటా. అమావాస్య సెంటిమెంట్‌తో బరిలో ఉన్న అభ్యర్థులు తెగ హైరానాకు గురౌతున్నారంట. ఎలచ్చన్ల ప్రచారంలో ఏపూట కాపూట ఓటర్ల ముంగిట్లోకి వెళ్లి వారికి సకల మర్యాదలు చేసి మస్కాకొట్టి ఓట్లే అభ్యర్థించాం. ఓటరన్న చేతుల్లోనే మా భవితవ్యం ఉందంటూ గ అమావాస్య రోజు ఓటర్‌ అన్నలు తమ ఓట్లను ఎవరెవరికి వేస్తారో శుక్రవారం అమావాస్య విజయ లక్ష్మి ఎవరిని వరిస్తుందో అని అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారంట. ఇంకేంఉంది అమావాస్య రోజే ఎన్నుకునే రోజు వచ్చిందే మంచోడికి ఓటేస్తే గ ఐదేళ్లు మనకు మంచిపాలన అందిస్తాడే.. గప్పుడే మనం బాగుంటాం.. మనఊరు బాగుంటుందంటూ రాత్రి అయ్యి కునుకు రావడంతో ఎవరి ఇంటిదారి వారు పట్టారు.

Next Story
Share it