Top
Sneha TV

రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టుకు ఏజీ ఏం చెప్పారంటే..

X

హైదరాబాద్:

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని విడుదల చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అడ్వకేట్ జనరల్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముందని ఏజీని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు గల కారణాలను రేపు సమర్పిస్తామని ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా చేసింది.

Next Story
Share it